దేవరకద్ర మండల కేంద్రంతోపాటు పెద్ద రాజమూరు గ్రామంలో శనివారం ఉదయం 11 గంటల సమయంలో కురిసిన అకాల వర్షానికి వరధాన్యం తడిసి ముద్దయింది. రాజమూర్ గ్రామంలో రైతులు వరి ధాన్యాన్ని కల్లాల వద్ద ఆరబెట్టుకున్నారు.ఆకస్మాత్తుగా అకాల వర్షం రావడంతో కొన్నిచోట్ల వరి పంట నేలకొరగా, మరికొన్నిచోట్ల కల్లాల్లో ఉన్న వరి ధాన్యం పూర్తిగా తడిచిపోవడంతో రైతన్నలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.చేతికొచ్చిన పంట వర్షార్పణం కావడంతో రైతులు ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.అదేవిధంగా దేవరకద్ర మార్కెట్ యార్డ్ లో అకాల వర్షానికి వరి బస్తాలు,కుప్పలు తడిసి ముద్దాయి.