జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలో సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో మండల రెవెన్యూ అధికారికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆ సంఘ నాయకులు మాట్లాడుతూ. 2014లో తెలంగాణ ఏర్పడిన తరువాత ప్రభుత్వం జారీ చేసిన జీవో 28 ద్వారా ఉద్యోగులను సిపిఎస్ విధానంలోకి నెట్టివేయడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వ సేవల అనంతరం ఉద్యోగుల భవిష్యత్తు భద్రతకు పాత పెన్షన్ విధానం తప్పనిసరిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో TPUS జిల్లా బాధ్యులు బండి మహేష్, కాశెట్టి రమేష్, శీలం రాజేష్,తదితరులు పాల్గొన్నారు.