శ్రీకాకుళం నగరంలోని ముఖ్య కూడళ్ళలో ట్రాఫిక్ పోలీసులు బుధవారం సాయంత్రం ముమ్మరంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. వాహనాల యజమానులకు హెల్మెట్ ధారణ, రాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ తదితర విషయాలలో కౌన్సిలింగ్ నిర్వహించడంతో పాటు కొందరికి చలానాలు విధించారు. ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని ఎస్ఐ సుధాకర్ అన్నారు.