కాకినాడజిల్లా తుని పట్టణ ప్రధాన రహదారులపై విచ్చలవిడిగా తిరుగుతున్న ఆవులు దున్నలు ఎద్దులను సంబంధించిన యజమానులు తీసుకువెళ్లాలని మున్సిపల్ కమిషనర్ వెంకటరావు సానిటరీ ఇన్స్పెక్టర్ సలీం తెలిపారు. యజమానులకు వారం రోజులు వ్యవధి ఇస్తున్నామని ఈలోపు తీసుకువెళ్లకపోతే వీటిని ఇతర ప్రాంతాలకు తరలిస్తామని వారు తెలిపారు..ఇందుకు సంబంధించి తుని పట్టణంలో ప్రత్యేక అనౌన్స్మెంట్ కార్యక్రమం శనివారం నిర్వహించారు