జిల్లాలో ప్రజా రవాణాకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. మంగళవారం ASF జిల్లా కేంద్రంలోని కసాబ్ వాడి వార్డులో గల అంతర్గత రహదారులు, మురుగు కాలువలను మున్సిపల్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా రహదారులపై ఏర్పడిన గుంతలకు తక్షణమే మరమ్మత్తులు చేపట్టాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ప్రజలకు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, దోమల అభివృద్ధిని అరికట్టేందుకు మురుగు కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని, ఆయిల్ బాల్స్, బ్లీచింగ్ పౌడర్ పిచికారి చేయాలన్నారు.