ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న ప్రాంతం, కొత్తగా ఏర్పడ్డ మునిసిపాలిటీ ఏదులాపురం అభివృద్ధి కి ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఏదులాపురం మునిసిపాలిటీ తెల్దారుపల్లి, మద్దులపల్లి లలో మంత్రి పర్యటించారు.