నర్సాపూర్ (జి) మండలం కుస్లి గ్రామం నుండి ప్రేమ్ నగర్ తండా వరకు రూ.1.20 కోట్లతో బిటి రోడ్డు నిర్మాణ పనులకు బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. నియోజక వర్గంలో ప్రతి గ్రామానికి మారుమూల తండాల అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. అనంతరం భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలను, రోడ్లను పరిశీలించారు. రైతులకు నష్ట పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు నరేందర్, నాయకులు ముత్యం రెడ్డి, రాజేందర్, అర్జున్, ప్రవీణ్ పటేల్, మహిపాల్, భూమన్న, గంగాధర్, సుధాకర్, దత్తురాం తదితరులు పాల్గొన్నారు