నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని బాబుల్ గావ్ గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా మూత పడిన ప్రభుత్వ పాఠశాలను పునః ప్రారంభించిన ముధోల్ శాసన సభ్యులు పవార్ రామారావు పటేల్ . ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామారావు పటేల్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన భోజనంతో పాటు ఉచిత పాఠ్య పుస్తకాలు, రెండు జతల యూనిఫామ్ అందించడంతో పాటు విశాలమైన తరగతి గదులు, ఆట స్థలం ఉంటాయన్నారు. తల్లిదండ్రులు ఆలోచించి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి మండల అధికారి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు