యూరియా దొరకక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతన్నలు వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో మన గ్రోమోర్ సెంటర్ వద్ద మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు యూరియా కోసం గంటల తరబడి వేచి చూడవలసిన పరిస్థితి ఏర్పడిందని రైతన్నల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొక్కజొన్న, వరి, కంది పలు పంటలకు యూరియా వేయవలసిన సమయం వచ్చిన యూరియా లభించకపోవడంతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు. వ్యవసాయ అధికారులు సరైన సమాధానం ఇవ్వటం లేదని, పని వదులుకొని మరి యూరియా కోసం వేచి చూడవలసిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రజా ప్రతినిధులు అధికారులు స్పందించి సక్రమంగా కృషి చేయాలి సోమవారం రైతులు అన్నారు