Download Now Banner

This browser does not support the video element.

రాయచోటి లో అక్రమ వ్యాపారం చేస్తున్న చౌక దుకాణం సీజ్ రూ. 2.63 లక్షల విలువైన రేషన్ బియ్యం, పంచదార సీజ్

Rayachoti, Annamayya | Sep 4, 2025
అన్నమయ్య జిల్లా, రాయచోటి పట్టణం, అలీమాబాద్ వీధిలోని చౌక దుకాణం 10లో విజిలెన్స్ అధికారులు గురువారం ఉదయం ఆకస్మికంగా దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో రూ. 2.63 లక్షల విలువచేసే 5,362 బస్తాల రేషన్ బియ్యం, 341కేజిల పంచదారను విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారు. ఈ రేషన్ డీలర్ అంజాద్ అలీకి చెందినవిగా అధికారులు తెలిపారు. డీలర్ కాకుండా అబ్రార్ ఉల్ హుక్ అనే వ్యక్తి అక్రమంగా విక్రయిస్తుండగా దాడులు జరిపామన్నారు. ఈ దాడుల్లో కడప విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ సీఐ నాయకుల నారాయణ, డిసిటిఓ బాబు మోసెస్, విజిలెన్స్ అధికారి టిప్పుసుల్తాన్ తదితరులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us