శ్రీకాకుళంలోని రిమ్స్ హాస్పిటల్లో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పీడియాట్రిక్ విభాగం వద్ద స్లాబ్ పెచ్చులు ఊడిపడిపోతున్నాయి. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగనప్పటికీ రోగుల సహాయకులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి అక్కడ ఉన్న వైద్య విభాగాన్ని తాత్కాలికంగా ప్రక్క భవనానికి తరలించారు.