కొడుకుని నియోజకవర్గ వ్యాప్తంగా గురువారం ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. తెల్లవారుజాము నుంచే ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం రావడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. వర్షం రాకతో వీధులన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రదేశాల్లో నీళ్లు నిలిచాయి. గూడూరు మండలంలోని పెంచికలపాడు వద్ద వక్కెర వాగు పొంగి ప్రవహిస్తోంది. ఉదయం పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు దారి వెంట వెళ్లే వాహనాలను ఆశ్రయించి అవతలిగట్టుకు చేర్చారు. అయితే క్రమేణా వరద పెరగడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది.