ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల కర్నూలు నగరంలోని పోలీసులు ఎరువుల దుకాణాలు, గోదాములను తనిఖీ చేశారు. అధిక ధరలకు విక్రయిస్తున్న కర్నూలు బళ్లారి రోడ్డులోని శ్రీలక్ష్మి ఫర్టిలైజర్స్పై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు విక్రయించాలని ఎస్పీ సూచించారు