పల్నాడు జిల్లా,నరసరావుపేటలో కోటప్పకొండ రోడ్‌లోని శ్రీనివాస నగర్ వద్ద మంగళవారం నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు మట్టి వినాయకుడి విగ్రహాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం అందరూ వినాయక చతుర్థి ఉత్సవాల సందర్భంగా మట్టి విగ్రహాలను మాత్రమే ఉపయోగించాలని కోరారు. "ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు నీటి కాలుష్యానికి కారణమవుతున్నాయన్నారు.మట్టి విగ్రహాలు సహజంగా కరిగిపోతాయి మరియు ప్రకృతిని కాపాడతాయి. ఈ సాంప్రదాయాన్ని అనుసరించడం ద్వారా మనం భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందించవచ్చు" అని ఆయన అన్నారు.