కాకినాడ జిల్లా తుని పట్టణ శ్రీనివాసా థియేటర్ ప్రాంతంలో ఉన్న స్మశాన వాటికను 10 లక్షలతో అభివృద్ధి చేస్తున్నట్లు తుని చైర్పర్సన్ నార్ల భవన రత్నాజీ బుధవారం తెలిపారు.నిజానికి అతిపెద్ద సమస్యగా తునిలో ఈ స్మశాన వాటిక ఉందని చెప్పుకోవచ్చు.. పూడ్చిన మృతదేహాలను సైతం కుక్కలు బయటికి లాక్కొచ్చిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇలాంటి తరుణంలో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం రావడంతో ప్రజల సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు