ఖిల్లా ఘనపూర్ మండలంలోనీ పలు గ్రామాల్లో ఉన్న శివాలయాల్లో శుక్రవారం వైభవంగా నిర్వహించిన మహాశివరాత్రి వేడుకలకు భక్తులు ఉపవాస దీక్షతో భక్తిశ్రద్ధలతో శివలింగానికి అభిషేకాలు చేసి భక్తి పరవశంతో మునిగిపోయారు. మండల కేంద్రంలోని శ్రీ ఘణ లింగేశ్వర వీరభద్ర స్వామి ఆలయం ఆవరణలో ఆలయ కమిటీ నిర్వాహకులు విద్యావతి ఆధ్వర్యంలో మహాశివరాత్రి సందర్భంగా రమణీయంగా శివపార్వతుల కళ్యాణం నిర్వహించారు