సైన్స్ ల్యాబ్ లు విద్యార్థుల సృజనాత్మకతను ప్రోత్సహిస్తాయని అలాగే వారి సొంత ఆలోచనలను రూపొందించుకోవడంలో సైన్స్ ల్యాబ్ లు సహాయపడుతయని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు.అమెరికన్ ఇండియా ఫౌండేషన్,అట్లాసియాన్ NGO లు ముందుకు వచ్చి 15 లక్షల ఖర్చు తో పెంబర్తి లోని జడ్పీ హై స్కూల్ లో ఏర్పాటు చేసిన సైన్స్ ల్యాబ్ లను NGO ప్రతినిధులతో కలిసి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ బుధవారం ప్రారంభించారు.