కోరుట్ల ట్రాన్స్ఫార్మర్ వైర్ తగిలి ఐదు గేదెలు మృతి జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో మంగళవారం మధ్యాహ్నం డి ఫార్టీ కెనాల్ పక్కన ఉన్న వెంకటా సాయి కాలనీలో విషాదం చోటుచేసుకుంది. ట్రాన్స్ఫార్మర్ వద్ద ఉన్న సపోర్ట్ వైర్ తెగిపోయి 11 కెవి విద్యుత్ లైన్ తగలడంతో ఐదు గేదెలు అక్కడికక్కడే మృతి చెందాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.