చింతకాని మండలంలో భారీ వర్షాల కారణంగా కందికుంట చెరువు అలుగు పారడంతో, రామకృష్ణాపురం వద్ద వంతెన నీట మునిగింది. దీంతో ఖమ్మం-బోనకల్ ప్రధాన రహదారిపై పందిళ్ళపల్లి వద్ద చెరువు నీరు పొంగిపొర్లి, రహదారిపైకి చేరడంతో ఖమ్మం-బోనకల్ మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అధికారులు రహదారిపై బందోబస్తు ఏర్పాటు చేసి, ప్రజలను అపభ్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.