తంబళ్లపల్లి నియోజకవర్గ సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. తాగునీరు, సాగునీరు, ఎరువులు, ఆరోగ్యం, విద్యుత్ వంటి అంశాలపై ముందస్తు ప్రణాళికలతో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి శనివారం సమస్యలపై నోట్స్ సమర్పించాలని, తాగునీటి వనరులను తరచూ తనిఖీ చేసి క్లోరినేషన్, శుభ్రపరిచే చర్యలు తప్పనిసరిగా చేపట్టాలని స్పష్టం చేశారు. రాబోయే రబీ సీజన్‌కు ఎరువులు, విత్తనాల ప్రణాళికలు ముందుగానే సిద్ధం చేయాలని ఆయన పేర్కొన్నారు.