బండి సంజయ్... కేటీఆర్ ల ఆత్మీయ పలకరింపు నిత్యం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే కేంద్ర మంత్రి బండి సంజయ్ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లు ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. గురువారం నర్మాల వద్ద వరదల్లో చిక్కుకున్న బాధితులను పరామర్శించేందుకు వచ్చిన వారు ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకొని ఆలింగనం చేసుకోవడం విశేషం. అటు బిజెపి శ్రేణులు ఇటు గులాబీ నాయకులు ఈ సంఘటనను చూస్తూ ఉండిపోయారు.