భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గురువారం జనగామ జిల్లాలో పర్యటించారు.ఈ సందర్భంగా ఆయనకు బిజెపి శ్రేణులు ఘనస్వాగతం పలికారు.స్థానిక నెహ్రూ పార్క్ నుండి జూబ్లీ గార్డెన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటుచేసిన బిజెపి జిల్లా విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అమలు గాని హామీలిచ్చి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి హామీలను నెరవేర్చలేక పోయిందన్నారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల పేరుతో 10 శాతం మేరా ముస్లింలకు రిజర్వేషన్లు కట్టబెట్టే యువజన చేస్తుందని, అసలైన బీసీలను మోసం చేస్తుందని అన్నారు.