ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం కమ్మవారిపల్లిలో ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్యాధికారి శ్రీనాథ్ మాట్లాడుతూ సీజనల్ జ్వరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రోగులను పరీక్షించి మందులను పంపిణీ చేయడం జరిగింది అన్నారు. ప్రభుత్వ వైద్య సేవలను వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.