ములుగు గల్లా కేంద్రంలో శ్రీ వినాయకుడి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఏర్పాటు చేసిన లడ్డు వేలం పాట ఏకంగా లక్షరూపాయలు పలికింది. నేడు శనివారం రోజున సాయంత్రం 7 గంటలకు హోరాహోరీగా కొనసాగిన లడ్డు వేలం పాటలో జిల్లా కేంద్రానికి చెందిన వారాహి రెస్టారెంట్ యాజమానులు బొమ్మగాని ప్రభు, పైడిమల్ల అనిల్ లు రూ.1,16,000/– లకు కైవసం చేసుకున్నారు. ఉత్సవ కమిటీ సభ్యులు వారిని ఘనంగా సన్మానించి లడ్డును అందజేశారు. జిల్లాలో లక్ష రూపాయలు పలికిన ఏకైక లడ్డుగా మారింది.