కోవూరు: రైలు ఢీ కొని వ్యక్తి మృతి పడుగుపాడు రైల్వేస్టేషన్ సమీపంలోని ఎన్టిఎస్ గేట్ వద్ద రైలు ఢీకొని బి. శివనారాయణ్ (40) అనే వ్యక్తి మృతి చెందాడు. మృతుడు పడుగుపాడుకు చెందినవాడిగా గుర్తించారు. రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నెల్లూరులోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.