కడప జిల్లా బద్వేల్ సుందరయ్య కాలనీలో గురువారం వడ్డెర సంఘం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 8,9,10 తేదీలలో కడప నగరంలో జరిగే అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ సమావేశాలను జయప్రదం చేయాలని కోరుతూ కరపత్రాలను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వడ్డెర సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు రమణయ్య, గంగయ్య, జిల్లా నాయకులు సునీల్ మాట్లాడుతూ సెప్టెంబర్ 8 న అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ సమావేశాల సందర్భంగా భారీ ప్రదర్శన, బహిరంగ సభ జరుగుతున్నదని ఈ సభలకు ముఖ్య అతిథులుగా కేరళ లెఫ్ట్ ఫ్రంట్ నాయకులు విజయ రాఘవన్, వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కార్యదర్శి వెంకట్, తదితరులు పాల్గొం టారన్నారు.