భీమవరం నియోజకవర్గ టిడిపి కార్యాలయంలో నియోజకవర్గ ఇన్‌చార్జ్, పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కుటుంబంలో ఎవరు అనారోగ్యంతో బాధపడితే మొత్తం కుటుంబం ఆందోళనలో ఉంటుందని, అలాంటి వారికి సీఎం చంద్రబాబు అండగా సహాయనిధి ద్వారా ఆర్థిక చేయూత అందిస్తున్నారని అన్నారు. ఈరోజు భీమవరం మండలంలోని నాలుగు కుటుంబాలకు రూ.2.50 లక్షల ఆర్థిక సహాయం చెక్కుల రూపంలో పంపిణీ చేసినట్టు చెప్పారు.