కొరిశపాడు మండలం మెదరమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటపురం క్రాస్ రోడ్డు వద్ద గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనంపై రోడ్డును క్రాస్ చేస్తున్న వ్యక్తిని కారు ఢీకొనటంతో ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు గుడిపాడు గ్రామానికి చెందిన వెంకటేశ్వర రెడ్డి గా స్థానికులు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.