నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని కేసరి సముద్రం చెరువు ఆలుగులో చేపల వేటకు వెళ్ళిన వృద్ధుడు ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందిన సంఘటన ఆదివారం చోటుచేస్తుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నాగర్ కర్నూల్ మండల పరిధిలోని హౌరాసు పల్లి గ్రామానికి చెందిన సత్యం కేసరి సముద్రం చెరువు అలుగులో చేపల వేటకు వెళ్లగా వల విసురుతుండగా ప్రమాదవశాత్తు కాలుకు వల చుట్టుకొని కిందపడటంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని జనరల్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు.