ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఈనెల 15న కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం చేపడుతున్నామని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షా, కార్యదర్శులు మునెప్పు, చంద్రశేఖర్లు పేర్కొన్నారు. కర్నూల్ ఏఐటీయూసీ కార్యాలయంలో బుధవారం ఉదయం 12 గంటలు ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ఆటో కార్మికులకు శాపంగా మారిన జీవో 21,31 లను రద్దు చేయాలన్నారు. వాహన మిత్ర కింద 15. వేలు ఆటో కార్మికులకు ఇచ్చి ఆదుకోవాలన్నారు.