ఈ నెల నాలుగున జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమాన్ని గగ్గలపల్లి వద్ద ఉన్న తేజ కన్వెన్షన్ లో నిర్వహించనున్నట్లు నాగర్కర్నూల్ డిఈఓ రమేష్ కుమార్ బుధవారం తెలిపారు. జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమానికి రాష్ట్ర ఇచ్చెయ్ శాఖామంత్రి జూపల్లి కృష్ణారావుతోపాటు ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి ఎమ్మెల్యేలు హాజరుకానున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి ఉపాధ్యాయులు హాజరై విజయవంతం చేయాలని కోరారు.