భూపాలపల్లి జిల్లా కేంద్రంలో గత 2 రోజులుగా సింగరేణి కార్మికులకు సొంత ఇంటి స్థలం కేటాయించాలని బ్యాలెట్ పద్ధతిన కార్మికుల నుంచి వివరాలు సేకరించి ఓటింగ్ నిర్వహించి 3వేల ఓటింగ్ చిట్టిలను అభిప్రాయ రూపంలో తీసుకుని విడుదల చేసినట్లు సిఐటియు జిల్లాఅధ్యక్షులు బందు సాయిలు శనివారం మధ్యాహ్నం 12 గంటలకు తెలిపారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ 40,000 మంది సింగరేణి కార్మికుల యొక్క శ్రమఫలితంగా వేలకోట్ల రూపాయల లాభాల్లో సింగరేణి ఉందన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వేల కోట్లు డివిడెంట్ రూపంలో చెల్లిస్తున్న సింగరేణికార్మికులశ్రమకుతగ్గట్టుగా సొంతింటి స్థలం వెంటనే కేటాయించాలనిడిమాండ్ చేస్తున్నామన్నరు.