Download Now Banner

This browser does not support the video element.

జమ్మలమడుగు: పట్టణ సమీపంలో లారీ బీభత్సం...గొర్రెల కాపరితో పాటు 15 గొర్రెలు మృతి,మరొకరి పరిస్థితి విషమం

India | Sep 10, 2025
కడప జిల్లా జమ్మలమడుగు సమీపంలోని తాడిపత్రి బైపాస్ రోడ్డులో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. ఈరోజు తెల్లవారుజామున 5 గంటలకు గొర్రెల మందపై గుర్తు తెలియని లారీ దూసుకెళ్లడంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తుంది.ఈ ప్రమాదంలో గొర్రెల కాపరులు వెంకటేష్ (50) మృతి చెందగా నరసింహులు (32) పరిస్థితి విషమంగా వుంది. ప్రమాదంలో సుమారు 15 గొర్రెలు మృతి చెందాయి. ఈ ప్రమాదానికి కారణమైన లారీతో సహా డ్రైవర్ పరారైనట్లు తెలుస్తుంది.తీవ్ర గాయాలపాలైన నరసింహులును జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలు ఆసుపత్రికి తరలించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us