రూ.15 వేల కానుక.. ఆటో డ్రైవర్ల హర్షం వ్యక్తం ఆటో డ్రైవర్లకు CM చంద్రబాబు రూ.15 వేల దసరా కానుకను ప్రకటించడంపై రేణిగుంటలో పలువురు ఆటో డ్రైవర్లు హర్షం వ్యక్తం చేశారు. స్త్రీ శక్తి పథకం ద్వారా ఆటో డ్రైవర్లు నష్టపోయారని, వారిని ప్రభుత్వం మరింతగా ఆదుకోవాలని భారతీయ మద్దూర్ సంఘ్ జిల్లా కార్యదర్శి వెంకటాద్రి యాదవ్ కోరారు. ప్రత్యేక పథకాలు అందించడంతోపాటు పిల్లల స్కూల్ ఫీజులలో రాయితీలు కల్పించాలని ఆయన కోరారు.