టెక్కలి మండలం కె. కొత్తూరు గ్రామంలో ఇళ్లల్లో నుంచి వర్షపు నీరు ప్రవహించింది. మంగళవారం కురిసిన వర్షానికి గ్రామంలోని కొన్ని ఇళ్లల్లో నుంచి వర్షపు నీరు కాలువలను తలపిస్తూ ప్రవహించడంతో గ్రామస్థులు ఇబ్బందులు పడ్డారు. గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో వర్షం పడిన ప్రతీ సారీ ఇదే పరిస్థితి నెలకొంటుందని గ్రామస్థులు అంటున్నారు. బుధవారం నాటికి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.