కళ్యాణదుర్గం వైసీపీ సమన్వయకర్త తలారి రంగయ్య పై టీడీపీ నాయకులు ధ్వజమెత్తారు.నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు.కళ్యాణదుర్గంలోని టీడీపీ కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో టీడీపీ సీనియర్ నాయకులు మల్లికార్జున, మండల కన్వీనర్ శ్రీరాములు,వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ రమేష్,మార్కెట్ యార్డ్ చైర్మన్ లక్ష్మీదేవి తదితరులు మీడియాతో మాట్లాడారు.ఎమ్మెల్యే సురేంద్రబాబును రంగయ్య విమర్శించడంపై ధ్వజమెత్తారు.రంగయ్య కళ్యాణదుర్గంలో ఎక్కడ పర్యటించినా అడ్డుకొని తీరుతామన్నారు.ఎమ్మెల్యే సురేంద్రబాబుని వ్యంగంగా మాట్లాడడం మంచి పద్ధతి కాదన్నారు. బుద్ధి లేకుండా మాట్లాడవద్దన్నారు.