అనంతపురం నగరంలోని సాయి నగర్ మొదటి క్రాస్ లో ఉన్న లేడీస్ హాస్టల్ లో డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది. దీంతో గమనించిన తోటి విద్యార్థులు ఆమెను అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతు మృతి చెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.