కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ దిష్టిబొమ్మ దగ్ధం..అడ్డుకున్న పోలీసులు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో నిన్న బీజేపీ నాయకులు టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ శ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఫోటోను తగలబెట్టినందుకు నిరసనగా మంగళవారం మద్య్హనం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ దిష్టిబొమ్మను మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దహనం చేస్తుండగా ఇల్లంతకుంట పోలీసులు చేరుకోని అడ్డుకున్నారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ దొంగ ఓట్లతో బిజెపి ప్రభుత్వం గెలిచిందని ఆధారాలతో సహా మా నాయకుడు రాహుల్ గాంధీ చూపెట్టారని తెలిపారు. మా నాయకుల దిష్టిబొమ్మలను తగలబెడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.