హెచ్ కారడవలస, పెద్ద బొండపల్లి రెవెన్యూ పరిధిలో ఉన్న ఎలుగుల మెట్టపై గ్రానైట్ తవ్వకాల చేపట్టవద్దని ఏపీ రైతు సంఘం జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. శుక్రవారం ఏపీ రైతు సంఘం నాయకులు ఎలుగుల మెట్టపై గల కొండను పరిశీలించారు. అనంతరం కొండ తవ్వకాలను ఖండిస్తూ గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎం.కృష్ణమూర్తి మాట్లాడుతూ గ్రానైట్ తవ్వకాలు వద్దే వద్దని యావధ్మంది మంది ప్రజలు వ్యతిరేకించారని, దానిని ఏపి రైతు సంఘం బలపరుస్తుందని అన్నారు. తక్షణమే గ్రానైట్ తవ్వకాలకు అనుమతులు ఇవ్వాలనే ఆలోచన ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు.