శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలో వినాయక నిమజ్జన శోభాయాత్రను మంగళవారం జిల్లా ఎస్పీ రత్న పరిశీలించారు. వినాయక నిమజ్జనాలు జరుగుతున్న తీరు, శోభాయాత్ర రూట్ మ్యాప్, నిమజ్జనం పాయింట్ల వద్ద తీసుకున్న చర్యలను అక్కడి అధికారులతో అడిగి తెలుసుకున్నారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిమజ్జనం పూర్తి అయ్యేవరకు అప్రమత్తతతో వ్యవహరించాలని పోలీసులకు ఎస్పీ సూచించారు. రాత్రి అయినప్పటికీ నిమజ్జనం కొనసాగుతోంది.