కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే డా..మూలె.సుధీర్ రెడ్డి మంగళవారం పులివెందుల వైస్సార్సీపీ క్యాంపు కార్యాలయంలో మాజీ సిఎం జగన్ మోహన్ రెడ్డి ని కల్సినట్లు నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గ కార్యకర్తలను,నాయకులను మాజీ సిఎం జగన్మోహన్ రెడ్డికి పరిచయం చేశారు. అనంతరం జగన్మోహన్ రెడ్డి తో నియోజకవర్గంలోని పలు అంశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.