జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు బాలలకు క్రీడలపై ఆసక్తి కనబరిచేలా ఉపాధ్యాయులు తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కరాటే బ్యాక్ బెల్ట్ హోల్డర్ సుభాని, లయన్స్ క్లబ్ అధ్యక్షులు రాంబాబు అన్నారు. భీమవరంలో శ్రీవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని శారీరక ఆరోగ్యానికి దోహదం చేస్తాయని అన్నారు. చదువుతో పాటు విద్యార్థులు క్రీడల్లో రాణించాలని అన్నారు.