కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని కోటిలింగేశ్వర నగర్ అభివృద్ధికి కాలనీ వాసులు సహకరించాలని కాలనీ అధ్యక్షుడు డాక్టర్ భట్టు విఠల్ కోరారు.ఆదివారం కాలనీవాసులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మున్సిపల్ అధికారులు స్పందించి వెంటనే కాలనీ సమస్యల పరిష్కరించాలని కోరారు. కాలనీలో ఏర్పడిన సమస్యల్ని వెంటనే మున్సిపల్ అధికారులు స్పందించాలని కోరారు.