ప్రకాశం జిల్లా దర్శి ఎమ్మెల్యే మరియు వైసీపీ జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ జరుగు నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర మాజీ సీఎం మరియు వైసీపీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు ఎరువుల కొరతతో ఇబ్బందులు పడుతున్నా రైతులకు మద్దతుగా నిలవాలని జిల్లా లోని వైసిపి నాయకులు, కార్యకర్తలు రైతులు పెద్ద ఎత్తున ఒంగోలు కలెక్టరేట్ మరియు మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్దకు తరలివచ్చి నిరసన కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు.