సంగారెడ్డి జిల్లా టెలికాం అడ్వైజర్ కమిటీ సభ్యులుగా వైద్యనాథ్ ఎంపికయ్యారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో శుక్రవారం మధ్యాహ్నం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో టెలికాం అడ్వైజర్ కమిటీ సభ్యులుగా ఎన్నికైన వైద్యనాథ్ ను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. రంజోల్ గ్రామానికి చెందిన వైద్యనాథ్ గతంలో అనేక పదవులతో పాటు టెలికాం అడ్వైజర్ కమిటీ సభ్యులుగా రెండవసారి ఎన్నికైనట్లు తెలిపారు తన ఎన్నికకు సహకరించిన ఎంపీ సురేష్ షెట్కార్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు శుక్లవర్ధన్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, నరేష్ గౌడ్ తదితరులు ఉన్నారు.