గుంటూరు నగర శివారు ప్రాంతమైన రెడ్డిపాలెంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. చంద్రగ్రహణం వేళ ఈ క్షుద్ర పూజలు ఈ పూజలు జరిగినట్లు తెలుస్తుంది. క్షుద్ర పూజలకు సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగులకు వచ్చింది. దీంతో ఒక్కసారిగా గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్థానిక నల్లపాడు పోలీసులకు సమాచారం అందించారు. మంగళవారం సాయంత్రం రెడ్డిపాలెం చేరుకున్న నల్లపాడు పోలీసులు క్షుద్ర పూజలు నిర్వహించిన ఇరువురిని అదుపులోకి తీసుకున్నారు. వారు ఎందుకు క్షుద్ర పూజలు నిర్వహించారు విచారించేందుకు పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు.