సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో చాకలి ఐలమ్మ 130వ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని మడివాల రజక సంఘం కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రజక సంఘం నాయకులు ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వీరనారి ఐలమ్మ పోరాటాన్ని గుర్తు చేశారు. జహీరాబాద్ పట్టణంలో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో డివిజన్ పరిధిలోని రజక సంఘం నాయకులు పాల్గొన్నారు.