అమెరికా ట్రంప్ విధిస్తున్న సుంకాలను వ్యతిరేకించాలని, ఆదోని సిపిఐ పట్టణ మండల కార్యదర్శిలు వీరేష్, రాజు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..భారతీయ సరుకుల దిగుమతులపై సుంకాన్ని 50 శాతానికి పెంచుతూ అమెరికా అధ్యక్షుడు ప్రకటించడంతో మన ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం పడిందని, కావ్య టెక్స్టైల్స్ గార్మెంట్స్ వంటి ఉత్పత్తులు తీవ్రంగా పడిపోయాయని దేశ సముద్ర ఉత్పత్తుల్లో 40 శాతం ఎగుమతులు ఆంధ్రప్రదేశ్ నుంచి అవుతున్నాయని యేటా సుమారు 2 వేల కోట్ల డాలరు విలువైన కావ్య ఉత్పతులు ఎగుమతులు ఘోరంగా పడిపోయింది అన్నారు.