ఆళ్లగడ్డ-కోట కందుకూరు ప్రాంతంలో కేసీ కెనాల్ కాలువలో కొందరు రజకులు వస్త్రాలు ఉతికేందుకు బండలు వేసి ఆక్రమణ చేశారు. దీంతో నీరు దిగువ కాలువలకు వెళ్లకుండా అవరోధం ఏర్పడింది. అనుమతి లేకుండా ధోబి ఘాట్లు ఏర్పాటు చేయడంపై రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే చర్యలు తీసుకుని ఆక్రమణలు తొలగించాలని ఇంజినీరింగ్ శాఖను రైతులు కోరారు.