పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం లోని పర్యాటకంగా అభివృద్ధి చేయనున్న ప్రాంతాలను జిల్లా పర్యాటక మరియు సాంస్కృతిక అధికారి నారాయణరావు పరిశీలించారు. ఆదివారం మధ్యాహ్నం నుండి సాయంత్రం ఐదు గంటల వరకు సాలూరు మండలంలోని శిఖపరువు వాటర్ ఫాల్స్ తో పాటు వెంగళరాయ సాగర్ జలాశయం, పాచిపెంట మండలంలోని ఆలూరు వాటర్ ఫాల్స్, పెద్దగెడ్డ జలాశయం ప్రాంతాలను ఉషోదయ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అకాడమీ గౌరవ అధ్యక్షుడు మొయిద కృష్ణారావు తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ ప్రాంతాలను పరిశీలించినట్లు తెలిపారు. పర్యాటకంగా ఈ ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు అ